

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్'పై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. రేపు సాయంత్రం 6 గంటలకు టీజర్ విడుదల కానుండగా, దానికి ముందు చిత్రబృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో రక్తంతో తడిసిన పిడికిలి, బ్లేడ్లతో కట్టిన నల్లటి మొలతాడును బిగిగా పట్టుకున్న దృశ్యం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇది నాని పోషిస్తున్న 'జడల్' పాత్రలోని పోరాటం, బాధ, తిరుగుబాటు స్వభావాన్ని ప్రతిబింబిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కయాడు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 95 సెకన్ల నిడివితో టీజర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు మరింత బలం చేకూర్చనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24, 2026న పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!