
జనరల్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఇరుముడి' నుంచి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ అయ్యప్ప భక్తి గీతం 'మల్లెపూల పల్లకి' ఉండనున్నట్లు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అధికారికంగా ధృవీకరించారు. ఈ ప్రకటనతో అయ్యప్ప భక్తులతో పాటు సినీ అభిమానుల్లోనూ భారీ ఉత్సాహం నెలకొంది.
ఎన్నో ఏళ్లుగా భక్తులను అలరిస్తూ వస్తున్న 'మల్లెపూల పల్లకి' పాటకు ప్రత్యేక ఆదరణ ఉంది. ఇప్పుడు అదే గీతాన్ని ఇరుముడి సినిమాలో ఎలా ఆవిష్కరిస్తారో అనే ఆసక్తి మరింత పెరిగింది. రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఈ తాజా అప్డేట్‌తో సినిమా సంగీతం, కథపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!