

అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ఆమోదించినట్లు వెలువడిన కొత్త చట్టం గృహహింస ఫిర్యాదుల విషయంలో తీవ్ర అంతర్జాతీయ విమర్శలకు దారి తీసింది. నివేదికల ప్రకారం, మహిళలు ఫిర్యాదు చేయాలంటే భర్త లేదా తండ్రి తప్పనిసరిగా పక్కన ఉండాలనే నిబంధనతో పాటు, ఎముకలు విరగడం లేదా రక్తపు గాయాలు వంటి తీవ్రమైన గాయాలు ఉన్నప్పుడే కేసు పరిగణలోకి తీసుకుంటారని పేర్కొంటున్నారు. అంతేకాకుండా, భర్తపై కేసుతో కోర్టుకు వచ్చినా మహిళ అతడితోనే హాజరుకావాల్సి ఉంటుందని సమాచారం. నేరం రుజువైతే భర్తకు కేవలం 15 రోజుల జైలు శిక్ష మాత్రమే ఉండడం కూడా విమర్శలకు దారి తీసింది.
అలాగే, భర్తపై ఫిర్యాదు చేయకుండా కోపంతో అమ్మగారింటికి వెళ్లిన మహిళకు మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశమున్నట్లు వార్తలు చెబుతున్నాయి. ఈ నిబంధనలపై మానవ హక్కుల సంస్థలు, అంతర్జాతీయ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మహిళల హక్కులు, న్యాయ రక్షణపై తీవ్రమైన ప్రభావం పడుతుందని విమర్శిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!