
టెక్నాలజీ

TG: రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధం ఉధృతంగా సాగుతోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు.
“BJP, BRS కలిసిపోయాయనే రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని” ఆయన స్పష్టం చేశారు. రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగినా తాను భయపడనని స్పష్టం చేస్తూ, “రాష్ట్ర అభివృద్ధి విషయంలో రేవంత్ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు.BJP ఏం చేసిందో ప్రజలకు తెలుసు” అన్నారు.అదే సమయంలో ఆయన కాంగ్రెస్ నాయకులను ఎద్దేవా చేస్తూ, “రూ.లక్ష కోట్ల అవినీతిని బయట పెడతామని రాహుల్, రేవంత్ ఇద్దరూ చెప్పి — రూ.లక్ష కూడా వెలికితీయలేకపోయారు” అంటూ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతుండగా, కిషన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!