

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్‌లోని వాహనాలు ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంతో రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా, కొంతమంది వైసీపీ నేతలు డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో వివాదం చెలరేగింది. అనుమతి లేకుండా ఏర్పాటు చేసినందుకు పోలీసులు ఆ సౌండ్ సిస్టమ్ తొలగించగా, నేతలతో వాగ్వాదం నెలకొంది.
స్థానికులు చెబుతున్నట్లుగా, వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం తరచూ ఇలాంటి ఘటనలకు కారణమవుతోంది. గతంలో కూడా జగన్ పర్యటనల్లో సత్తెనపల్లి, రాప్తాడులో ఇలాంటి వివాదాలు, ప్రమాదాలు చోటుచేసుకున్నాయని వారు గుర్తుచేశారు. జగన్ పర్యటనల సమయంలో నియమాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల భద్రతపై పార్టీ పెద్దలు శ్రద్ధ చూపాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.











కామెంట్స్ (1)
Safety should be the first priority.