

తదుపరి ఐపీఎల్ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం లండన్‌లో జరిగే సమీక్ష సమావేశంలో గత సీజన్ ప్రదర్శనతో పాటు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం. హార్దిక్ భవిష్యత్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్ ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కెప్టెన్సీ రేసులో జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అనుభవం పరంగా బుమ్రా ముందంజలో ఉన్నప్పటికీ తరచూ గాయాల బారిన పడటం అతనికి ప్రతికూలంగా మారే అవకాశముంది. మరోవైపు తిలక్ వర్మను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దాలని, అతని చుట్టూ యువ జట్టును నిర్మించాలని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో హార్దిక్ పాండ్యాపై చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!