
సినిమాలు

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు అంశం మరింత ఉత్కంఠగా మారుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ వైఖరిపై హీరో విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ఆయన సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
2017-18లో గోవా, మణిపూర్, మేఘాలయ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు గవర్నర్లు అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించిన విషయాన్ని విశాల్ గుర్తు చేశారు. ఇప్పుడు అదే విధానం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తమిళనాడులో చర్చ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!