
జనరల్

కృత్రిమ మేధస్సు (ఏఐ) ఇప్పుడు గ్రామాల వరకు విస్తరించి మన జీవితంలో భాగమైపోయింది. తాజాగా గ్రోక్ అనే చాట్‌బాట్‌కు ఓ నెటిజన్ “మీరు భారత పౌరులైతే ఎవరికి ఓటు వేస్తారు?” అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గ్రోక్ సమాధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు తెలిపినట్లు పేర్కొనబడింది. మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇండియా, యూపీఐ విప్లవం, భారత్ ఆర్థిక వృద్ధి వంటి అంశాలను ప్రస్తావించింది. అదే సమయంలో రాహుల్ గాంధీ గురించి స్పందిస్తూ సంక్షేమ పథకాలు ముఖ్యమైనవైనా ఉద్యోగాలు, సాంకేతికత, అంతర్జాతీయ ప్రతిష్టకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని తెలిపింది. చివరగా “డేటా ఓవర్ డైనస్టీస్” అనే పదాన్ని ఉపయోగించడం చర్చనీయాంశమైంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!