
గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నెల 14 వ తేదీ జరుగనున్న ఎన్నికల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు మొత్తం 91,286 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
మొత్తం 4,332 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 415 గ్రామాల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవం అయ్యాయి. శనివారం 7,584 మంది సర్పంచి అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఐదు పంచాయతీల్లో సర్పంచి పదవికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
మిగిలిన 3,912 పంచాయతీల్లో సర్పంచి పదవులకు 13,128 మంది పోటీ పడుతున్నారు.
నోటి ఫై చేసిన 38,322 వార్డుల్లో, 107 వార్డులకు నామినేషన్లు రాలేదు. 8,304 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మరోవైపు, 10,427 వార్డు సభ్యుల నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో, 29,911 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఈ వార్డుల్లో 78,158 మంది అభ్యర్థులు తుది పోరులో ఉన్నారు.
సర్పంచి పదవికి నామినేషన్లు రాని ఐదు గ్రామాలు:
నల్గొండ జిల్లా – 2
భద్రాద్రి-కొత్తగూడెం – 1
మంచిర్యాల – 1
వరంగల్ – 1
సర్పంచి పదవికి 500 మందికి పైగా పోటీదారులు ఉన్న తొమ్మిది జిల్లాలు:
నల్గొండ – 764 మంది (241 పంచాయతీలు)
సిద్దిపేట – 694 మంది (172 పంచాయతీలు)
సంగారెడ్డి – 649 మంది (229 పంచాయతీలు)
నిజామాబాద్ – 587 మంది (196 పంచాయతీలు)
మెదక్ – 541 మంది (142 పంచాయతీలు)
జగిత్యాల – 521 మంది (134 పంచాయతీలు)
ఆదిలాబాద్ – 513 మంది (139 పంచాయతీలు)
వికారాబాద్ – 510 మంది (155 పంచాయతీలు)
కామారెడ్డి – 506 మంది (153 పంచాయతీలు)
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ భార్య నజ్మా సుల్తానా సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రారంభంలో ఆమెతో పాటు కాసాల ఇందిరమ్మ నామినేషన్ వేశారు. గ్రామస్తులు, అన్ని పార్టీల నాయకులు నజ్మా సుల్తానా ఏకగ్రీవ ఎంపికకు మద్దతు ఇవ్వడంతో ఇందిరమ్మ ఆదివారం నాటికి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
ఈ పంచాయతీలోని ఎనిమిది వార్డులు కూడా ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో ముందుగానే ఏకగ్రీవం అయ్యాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!