

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు తెలిపారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (యూఎస్ఏ) ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రానున్న జీహెచ్‌ఎంసీ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి దెబ్బతిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల అంచనాలను అందుకోవడంలో విఫలమైందని రాంచందర్‌రావు విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌలిక వసతులు, జాతీయ భద్రత, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా దేశ అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి నిర్ణయాలను కూడా ప్రస్తావించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!