

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థి మోహన్ పెద్దపాటి అమెరికాకు చెందిన హ్యాకథాన్ ఏఐ సంస్థకు ముగ్గురు భారతీయ సహ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నట్లు సమాచారం. హర్ష్ జైస్వాల్, రాహుల్ మైనిలతో కలిసి ఆయన ఈ సంస్థను స్థాపించినట్లు పేర్కొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొండగుంటూరు పరిధిలోని సంపత్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2013-15 మధ్య చదువుకున్న మోహన్.. అనంతరం నూజివీడు ఆర్జీయూకేటీలో బీటెక్ పూర్తి చేసి, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు.
వెబ్ ఎక్స్‌ప్లాయిటేషన్, సోర్స్‌కోడ్ సమీక్ష, మొబైల్ అప్లికేషన్ భద్రత వంటి విభాగాల్లో మోహన్‌కు నైపుణ్యం ఉన్నట్లు చెబుతున్నారు. ఎథికల్ హ్యాకింగ్‌లో భాగంగా మోహన్, ఆయన సహచరులు ఏఐ సాధనాలను ఉపయోగించి ఓపెన్‌ఏఐ వ్యవస్థలోని లోపాలను గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రక్రియలో ఆంత్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐని ఉపయోగించడంతో పాటు సుమారు రూ.2.5 లక్షల విలువైన ఏఐ టోకెన్లను వినియోగించినట్లు పేర్కొంటున్నారు. అయితే ఈ వివరాలను విశ్వసనీయ అధికారిక వనరుల ద్వారా స్వతంత్రంగా నిర్ధారించలేకపోయాం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!