

కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత ముకుల్ రాయ్ (71) అనారోగ్య కారణాలతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కార్డియాక్ అరెస్ట్‌కు గురై తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు సుబ్రాన్షు వెల్లడించారు. ఆయన మృతిపట్ల పశ్చిమ బెంగాల్ రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్ రాయ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. టీఎంసీలో కీలక నేతగా ఎదిగిన ఆయన 2017 లో భాజపాలో చేరి బెంగాల్లో పార్టీ విస్తరణలో ముఖ్య పాత్ర పోషించారు. అనంతరం 2021 లో తిరిగి టీఎంసీలో చేరిన ఆయనను బెంగాల్ రాజకీయాల్లో చాణక్యుడిగా భావించేవారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2023 లో డిమెన్షియా బారినపడి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.












.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!