

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం నియోజకవర్గం ఓటర్ల సందడితో నిండిపోయింది. సాధారణ ప్రజలతో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో పలువురు సినిమా ప్రముఖులు నివాసం ఉండటంతో, ఈ ఉప ఎన్నికపై టాలీవుడ్ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, నటుడు అలీ, యాంకర్ సుమ కనకాల వంటి ప్రముఖులు మధురానగర్ మరియు షేక్‌పేట్ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయనున్నారు.
సినీ కార్మికుల సంఖ్య అధికంగా ఉండటంతో ఫిల్మ్ ఫెడరేషన్ ఈ రోజు షూటింగ్స్ రద్దు చేసి, వారికి సెలవు ప్రకటించింది. అయితే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ నివాసాలు జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నప్పటికీ, వారి ఓటు హక్కు ఖైరతాబాద్ నియోజకవర్గం కిందకు వస్తుంది. అందువల్ల వారు ఈ ఎన్నికలో ఓటు వేయలేరు.
ఈ ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. పార్టీలు తమ అభ్యర్థి విజయం కోసం పూర్వ శక్తినీ వినియోగిస్తున్నాయి. సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు ప్రజలను ఓటు వేయాలని ప్రోత్సహిస్తున్నారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!