
క్రీడలు

‘ది పారడైజ్’ సినిమా టీమ్ సమ్మక్క సారలమ్మను దర్శించుకుంది. హీరో నాని, నిర్మాత సుధాకర్ చెరుకూరి ఆలయానికి వెళ్లి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

సమ్మక్క సారలమ్మకు సంబంధించిన సంప్రదాయంలో భాగంగా హీరో నాని బెల్లం సమర్పించారు. ఆలయంలో నాని పూజలు చేస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఒదెల తెరకెక్కించిన ‘ది పారడైజ్’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఆలయ దర్శనం ప్రాధాన్యం సంతరించుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!