
రాజకీయాలు

‘తెల్లకాగితం’ చిత్రానికి సంబంధించిన కంటెంట్ అనుమతి లేకుండా ప్రచారం అవుతుండటంపై నిర్మాణ సంస్థ అరుణాచల క్రియేషన్స్ తీవ్రంగా స్పందించింది. శ్రీమతి కె. శ్రీదేవి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా లీక్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం, ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చిత్రబృందం అధికారిక ప్రకటనలో తెలిపింది.

లీకైన కంటెంట్‌ను ఎవరూ డౌన్లోడ్ చేయవద్దని, ఇతరులతో పంచుకోవద్దని, మళ్లీ ప్రచురించవద్దని ప్రేక్షకులు, నెటిజన్లను నిర్మాణ సంస్థ కోరింది. ‘తెల్లకాగితం’ చిత్రాన్ని థియేటర్లలోనే వీక్షించి, చిత్రబృందానికి పూర్తి మద్దతు అందించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది. చిత్రానికి సంబంధించిన అనధికారిక కంటెంట్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రేక్షకులు సహకరించాలని కోరింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!