26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

Writer: Chandrika 04:45 PM, 26 ఆగస్టు, 2026
22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ఎకరాలకు పైగా భూమిని నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు భూములు ఎలా బదిలీ అవుతున్నాయో తాము ఇప్పటికే వివరించామని, దీనిపై ఆధారాలు చూపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరిన నేపథ్యంలో అసెంబ్లీలో దాదాపు రెండు గంటలు ఆయన కోసం ఎదురుచూశానని చెప్పారు. అయితే మంత్రి రాలేదని, సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్‌ హయాంలో ఎంత భూమి 22ఏ జాబితాలో ఉందో, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత భూమిని అందులో చేర్చారో వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో కుట్ర ఉందని చెబుతున్నారని, అయితే ఆ కుట్రకు బాధ్యులు ఎవరో ప్రజలకు వెల్లడించాలని అన్నారు. ధరణి పోర్టల్‌లో అవకతవకలపై గతంలో విచారణకు ఆదేశిస్తామని చెప్పారని, ఆ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. 22ఏ భూముల అంశంపై సిట్టింగ్‌ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.15 వేల కోట్ల బదలాయింపుల ఆరోపణలపై హౌస్‌ కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని, అప్పటివరకు ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తున్నట్లు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..

టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..

రాజీనామాకు సిద్ధమైన కర్ణాటక మంత్రి ..

రాజీనామాకు సిద్ధమైన కర్ణాటక మంత్రి ..

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ
ట్యాగ్లు
ఏలేటి మహేశ్వర్‌రెడ్డితెలంగాణ బీజేపీతెలంగాణ రాజకీయాలు22ఏ భూములునిషేధిత భూములుపొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిరేవంత్‌రెడ్డిధరణి పోర్టల్కాంగ్రెస్ ప్రభుత్వంతెలంగాణ భూ వివాదం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

తెలంగాణలో  ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌
క్రీడలు

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం
జనరల్

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...
జనరల్

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..
క్రీడలు

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..
టెక్నాలజీ

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...
జనరల్

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌
సినిమాలు

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..
జనరల్

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
సినిమాలు

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్