

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నిర్వహించిన విచారణ ముగిసింది. ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి దాదాపు ఏడు గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలపై వివరాలు సేకరించినట్లు సమాచారం. అయితే, ఈ కేసుకు సంబంధించిన అంశాలపై కోర్టు ఆదేశాలు ఉన్నందున తాను ఈడీ ఎదుట కొన్ని విషయాలపై స్పందించలేనని మిథున్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం విక్రయాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, అధికారులు విచారణకు హాజరయ్యారు. తాజాగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఆయన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేసిన ఈడీ అధికారులు, నిధుల మళ్లింపు, అక్రమ లావాదేవీల కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!