

ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీను లక్ష్యంగా చేసుకుని రహస్య ఆపరేషన్ నిర్వహించారనే వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ అమెరికన్ పత్రిక The Wall Street Journal ప్రచురించిన కథనం ప్రకారం, ఖమేనీ నివాసం మరియు కార్యాలయం ఉన్న ఫోర్టిఫైడ్ కాంపౌండ్‌పై సమన్వయంతో దాడులు జరిగినట్లు పేర్కొంది.
శనివారం తెల్లవారుజామున సుమారు 1:15 గంటల సమయంలో ఆపరేషన్ ప్రారంభమైనట్లు సమాచారం. మొత్తం 30 బాంబు దాడులు జరిగాయని కథనం చెబుతోంది. ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లు ఇజ్రాయెల్ ప్రయోగించగా, తొమహాక్ మిస్సైళ్లతో అమెరికా కూడా దాడిలో పాల్గొన్నట్లు పేర్కొంది.
గత కొన్ని నెలలుగా ఖమేనీ పై ప్రత్యేక దృష్టి పెట్టి, దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. ఈ చర్యకు సౌదీ అరేబియా సహా కొన్ని గల్ఫ్ దేశాలు మద్దతు తెలిపినట్లు కథనం సూచించింది.
అయితే, ఈ సమాచారం పై సంబంధిత దేశాల నుంచి అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమైంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!