
రాజకీయాలు

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డ్రగ్స్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటులు డ్రగ్స్ పరీక్షలు చేయించుకున్న తర్వాతే వారి సినిమాలు విడుదల చేయాలని ఆయన సూచించారు. ఒకవేళ పరీక్షలకు నిరాకరిస్తే వారి సినిమాల విడుదలను ఆపివేయాలని పేర్కొన్నారు. డ్రగ్స్ మూలాలు సినీ రంగంలోనే ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఇక ప్రజాప్రతినిధులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి తొంభై రోజులకు ఒకసారి ప్రజాప్రతినిధులు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని, పరీక్షలకు నిరాకరిస్తే వారిని చట్ట సభలోకి అనుమతించకూడదని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ మరియు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.






.png&w=3840&q=75)







.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!