
క్రీడలు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఉపయోగించి ఓట్ల తొలగింపుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
‘మై టీడీపీ యాప్’ ద్వారా ఓటర్ల జాబితా అంశాల్లో చర్చలు జరిగినట్లు వచ్చిన ఆడియోను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రజల మనసు గెలుచుకోవాల్సింది పోయి ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలు, పేదల జీవనంపై దీని ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!