
క్రీడలు

కాంగ్రెస్తో పొత్తు తెగిపోవడంతో ప్రతిపక్షాల ఇండియా (INDI) కూటమి ఇక లేదని డీఎంకే స్పష్టం చేసింది. దీర్ఘకాల మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ తమను వెన్నుపోటు పొడిచిందని డీఎంకే సీనియర్ నేత డీకేఎస్ ఇళంగోవన్ ఆరోపించారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తు ద్వారా కాంగ్రెస్ ఒక రాజ్యసభ సీటు, 28 అసెంబ్లీ స్థానాలు పొందిందని గుర్తుచేస్తూ, ఆ పార్టీ వైఖరిని తీవ్రంగా విమర్శించారు.
కూటమికి కొత్త రూపు ఇస్తామని డీఎంకే నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ తన పాత రాజకీయ తీరు మార్చుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానంతో పోల్చి, తమిళనాడులో కాంగ్రెస్ ప్రవర్తన కూటమి నమ్మకాన్ని దెబ్బతీసిందని విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!