

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం తెలంగాణలో పర్యటించి సిర్పూర్ కాగజ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ‘విజయ సంకల్ప సభ’లో పాల్గొని బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించారు. ఈ సభకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, ఎంపీ గోదాం నాగేశ్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు తదితర ప్రముఖులు హాజరయ్యారు.
కరీంనగర్, నిజామాబాద్ పరిధిలో జరిగిన ప్రచార సభల్లో ఫడ్నవీస్ మాట్లాడుతూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాభివృద్ధిలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయాన్ని ప్రస్తావిస్తూ, అదే తరహా అభివృద్ధి తెలంగాణ నగరాల్లో కావాలంటే బీజేపీకి అధికారాన్ని ఇవ్వాలని ప్రజలను కోరారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేసే డబుల్ ఇంజిన్ సర్కార్తోనే మున్సిపాలిటీలకు వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ నెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!