

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19 న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ మరియు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కృష్ణా–గోదావరి జలాల అంశం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడంలో చూపుతున్న నిర్లక్ష్యం, అలాగే ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై విస్తృతంగా చర్చించనున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగ హక్కులను కాపాడేందుకు మరో ప్రజా ఉద్యమం అవసరమనే అభిప్రాయానికి పార్టీ వచ్చింది.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గతంలో కేటాయించిన 91 టీఎంసీలను తగ్గించి 45 టీఎంసీలకే అంగీకరించడం రైతాంగానికి తీవ్ర అన్యాయమని బీఆర్ఎస్ విమర్శించింది. కాంగ్రెస్, కేంద్ర బీజేపీ వైఖరులు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంటూ, ఈ అంశాలపై ఉద్యమ స్వరూపం దాల్చే కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపింది. తెలంగాణ సాగునీటి హక్కులు, ప్రాజెక్టుల రక్షణ కోసం బీఆర్ఎస్ ఎప్పటికీ రాజీ పడదని పార్టీ స్పష్టం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!