

తెలంగాణలో డీసీసీ పదవులకు కొత్త అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 36 జిల్లాలకు ప్రతినిధులను ప్రకటించింది. ఈ నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు గణనీయమైన ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.
ప్రాంతాల వారీగా కొత్తగా ఎంపికైన అధ్యక్షులు ఇలా ఉన్నారు: ఆదిలాబాద్‌లో నరేష్ జాదవ్, అసిఫాబాద్‌లో ఆత్రం సుగుణ, భద్రాద్రి కొత్తగూడెంలో తోట దేవీ ప్రసన్న, భువనగిరిలో బీర్ల అయిలయ్య. గద్వాల జిల్లాకు ఎం. రాజీవ్ రెడ్డి, హన్మకొండకు వెంకటరాం రెడ్డి, హైదరాబాద్‌కు ఖలీఫ్ సైదుల్లా నియమితులయ్యారు.
జగిత్యాలలో నందయ్య, జనగాంలో లఖావత్ ధనావతి, భూపాలపల్లిలో కరుణాకర్, కామారెడ్డిలో మల్లిఖార్జున్, కరీంనగర్ జిల్లాకు మేడిపల్లి సత్యం, కరీంనగర్ కార్పొరేషన్‌కు వీ. అంజన్‌కుమార్ నియమించబడ్డారు. ఖైరతాబాద్‌లో రోహిత్ ముదిరాజ్, ఖమ్మంలో నూతి సత్యనారాయణ, ఖమ్మం కార్పొరేషన్‌కు దీపక్ చౌధరి ఎంపికయ్యారు.
మహబూబాబాద్ జిల్లాకు భూక్య ఉమా, మహబూబ్‌నగర్‌కు సంజీవ్ ముదిరాజ్, మంచిర్యాలకు రఘునాథ్ రెడ్డి, మెదక్‌కు శివన్నగిరి ఆంజనేయులు గౌడ్, మేడ్చల్–మల్కాజిగిరికి తోటకూర వజ్రేష్ యాదవ్ బాధ్యతలు అప్పగించారు.
ములుగులో పైడాకుల అశోక్, నాగర్ కర్నూలులో డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నల్గొండలో కైలాశ్ నేత, నారాయణ్‌పేట్‌లో కొల్లుకుదురు ప్రశాంత్ రెడ్డి, నిర్మల్‌లో వెడ్మ బొజ్జు కొత్తగా నియమితులయ్యారు.
నిజామాబాద్ జిల్లాకు నగేశ్ రెడ్డి, కార్పొరేషన్ విభాగానికి బొబ్బిలి రామకృష్ణ, పెద్దపల్లికి ఎంఎస్ రాజ్ ఠాకూర్, రాజన్న సిరిసిల్లకు సంగీతం శ్రీనివాస్, సికింద్రాబాద్‌కు దీపక్ జాన్ నియామకాలు జరిగాయి. సిద్దిపేటలో ఆంక్షా రెడ్డి, సూర్యాపేటలో గుడిపాటి నర్సయ్య, వికారాబాద్‌లో ధారాసింగ్ జాదవ్, వనపర్తిలో శివసేనా రెడ్డి, వరంగల్ జిల్లాకు మహ్మద్ అయ్యుబ్ బాధ్యతలు అప్పగించబడ్డాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!