
బిజినెస్

తమిళగ వెట్రి కళగం (టీవీకే) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధినేత విజయ్ ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయానికి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. రెండు వారాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని టీవీకే గవర్నర్ను కోరినట్లు సమాచారం. టీవీకే 108 సీట్లు గెలిచి మెజారిటీకి కేవలం 10 సీట్లు దూరంలో నిలిచింది. డీఎంకే 59, ఏఐడీఎంకే 47 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, పీఎంకే, ఐయుఎంఎల్, బీజేపీ, డీఎండీకే వంటి పార్టీల మద్దతు కీలకంగా మారనుంది.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!