

జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే ప్రభుత్వ యంత్రాంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. సమర్థులైన అధికారులను తన బృందంలోకి తీసుకునే దిశగా సీఎం విజయ్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సెంథిల్ కుమార్ ను ముఖ్యమంత్రికి అదనపు ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి-Iగా బదిలీ చేశారు.

అలాగే ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న లక్ష్మీ ప్రియ ను ముఖ్యమంత్రికి కార్యదర్శి-IIగా నియమించారు. సీఎం అయిన కొద్ది గంటల్లోనే ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను తన కార్యదర్శులుగా నియమించుకోవడం తమిళనాడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పదవులకు ఐఏఎస్ పే రూల్స్-2016 ప్రకారం ప్రధాన కార్యదర్శి స్థాయి హోదా, బాధ్యతలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!