
సినిమాలు

రాబోయే మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జూమ్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌తో పాటు ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఎన్నికల వ్యూహం, పార్టీ సమన్వయం, ప్రచార ప్రణాళికలపై ఈ సమావేశంలో కీలక చర్చ జరగనుందని సమాచారం.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ ఈ నెల 4 నుంచి 8 వరకు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల సభల్లో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!