

రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు కోట్ల మంది ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమ ఓటుతో ధైర్యం, సంకల్పం ఇచ్చిన ప్రజల ఆశయాలకు తగిన విధంగా తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు తాను అహర్నిశలు శ్రమించానని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు భరోసా, బలహీన వర్గాలకు న్యాయం అందించడమే తమ పాలన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇళ్లు, రూ.500 గ్యాస్ సిలిండర్, సన్నబియ్యానికి బోనస్, యంగ్ ఇండియా మోడల్ స్కూళ్లు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి పథకాలు రెండు సంవత్సరాల పాలనకు స్పష్టమైన నిదర్శనాలుగా నిలిచాయని వివరించారు. 2047 నాటికి తెలంగాణను ప్రపంచ స్థాయిలో నిలపే దిశగా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. “తెలంగాణ రైజింగ్” అనే నినాదంతో రాబోయే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రభుత్వం సమగ్రంగా సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!