

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల అహర్నిశల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్ల ప్రజాపాలన, పేద మరియు మధ్యతరగతి ప్రజల సంక్షేమ కార్యక్రమాలు, ప్రపంచస్థాయి ప్రణాళికలతో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సంపూర్ణ ఆమోదం తెలుపుతూ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతున్నామని సీఎం అన్నారు. ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ను మరింత అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం దిల్లీలో జరిగిన మర్యాదపూర్వక సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ఫలితాల వివరాలు తెలియజేయగా ఆమె అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ ఘన విజయం సాధ్యమైందని సీఎం వివరించారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్నారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!