

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్తున్న సందర్భంగా ఈ భేటీ జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్య అంశాల పై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన ఆర్థిక సహాయం, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన మద్దతు వంటి విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.
నిర్మలా సీతారామన్ తో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పెద్ద అవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన రామ్మోహన్ రావు తల్లి వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి సీఎం నివాళులు అర్పించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!