
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, నీతి ఆయోగ్ సభ్యులతో ఆయన కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టులు, పెట్టుబడులు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా జాతీయ రాజధానిలో జరుగుతున్న సీఐఐ వ్యాపార సదస్సులో కూడా చంద్రబాబు పాల్గొననున్నారు. పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక వసతుల అభివృద్ధిపై ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. ఈ ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి కీలకంగా మారనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!