

మొంథా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ప్రజలు ఆందోళనతో నిద్రలేక రాత్రులు గడుపుతుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ మాత్రం ప్రజల భద్రత కోసం క్షణం విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. గత రెండు రోజులుగా చంద్రబాబు అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలోనే ఉండి ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే వరకు తుఫాను పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మంగళవారం కూడా అర్ధరాత్రి తర్వాత వరకూ సమీక్షలు కొనసాగించారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రత్యేక బృందాలను పంపించి, అక్కడి పరిస్థితిని క్షణక్షణం తెలుసుకున్నారు. భారీ వర్షాల మధ్య కాల్వలు, చెరువులు, రహదారుల నష్టం వంటి అంశాలను రాత్రిపూట కూడా పర్యవేక్షించారు. శాఖల వారీగా నష్ట వివరాలను సిద్ధం చేయాలని, వర్షం తగ్గగానే విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. తుఫాను ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఆయన సమీక్షలను ఆపకుండా, జిల్లాల మంత్రులతో నిరంతరం సంప్రదింపులు జరిపారు.
ఇక మంత్రి నారా లోకేష్ కూడా మంగళవారం రాత్రంతా ఆర్టీజీఎస్ కేంద్రంలోనే ఉండి పర్యవేక్షణ కొనసాగించారు. బుధవారం ఉదయం కూడా ఆయన జిల్లాల పరిస్థితిపై సమీక్షలు జరిపారు. ప్రజలకు తక్షణ సాయం అందించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రంతా మెలకువగా ఉండి వర్షాల తీవ్రత, ఈదురుగాలుల ప్రభావాన్ని తెలుసుకుంటూ ప్రజల భద్రత కోసం మార్గనిర్దేశం చేశారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (1)
అంకితభావం కలిగిన నాయకత్వం – ప్రజల కోసం నిరంతర కృషి!