

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను ప్రముఖ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ – 2025 (ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025) అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డు లభించడంతో టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, మంత్రులు, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. నారా కుటుంబ సభ్యులు కూడా ఈ గౌరవాన్ని సంతోషంగా స్వీకరించారు.
అయితే చంద్రబాబు మాత్రం సత్కారాలపై భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ సన్మానాల కోసం ప్రయత్నించలేదని, పని చేసుకుంటూ ముందుకు వెళ్లడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని చెప్పారు. తన పాలనపై ప్రజలు వ్యక్తం చేసే సంతృప్తినే తాను నిజమైన సత్కారంగా భావిస్తానని స్పష్టం చేశారు.
గతంలో తన పనితీరును గుర్తించి విదేశీ యూనివర్సిటీల నుంచి దేశీయ విశ్వవిద్యాలయాల వరకు డాక్టరేట్లు ఇవ్వాలని ముందుకు వచ్చినా, వాటిని తాను సున్నితంగా తిరస్కరించినట్లు చంద్రబాబు తొలిసారి వెల్లడించారు. ఇప్పటివరకు ఇలాంటి అవార్డులను స్వీకరించలేదని తెలిపారు. ఈ అవార్డు అందించినందుకు ఎకనామిక్ టైమ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దీనికి కారణం అధికారుల కృషి, మంత్రుల సహకారం, అలాగే క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతేనని వినయంగా పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!