
.jpg&w=3840&q=75)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత తప్పిదాల కారణంగా పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మంగళవారం తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో డ్రగ్స్ వివాదంపై ఆయన సీరియస్‌గా స్పందిస్తూ, దురలవాట్లలో పడే నాయకులను పార్టీ ఎందుకు భరించాలి అని ప్రశ్నించారు.
2024 ఎన్నికల్లో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మహేశ్ యాదవ్‌కు అవకాశం ఇచ్చామని తెలిపారు. “ఎంపీగా ఉండి అలాంటి పార్టీలకు వెళ్లడం తప్పే. కొందరు తమకు వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేస్తున్నారు. మంచి రాజకీయ నేపథ్యం ఉన్నవారే ఇలా వ్యవహరిస్తే అది ఆందోళనకరం,” అని చంద్రబాబు అన్నారు. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని గుర్తుచేసి, తెలుగుదేశం పార్టీలో అందరూ క్రమశిక్షణతో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!