

“గొడ్డలి పార్టీ” అనే మాట ప్రజల్లోకి వెళ్లే కొద్దీ ప్రత్యర్థుల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో అనౌపచారికంగా మాట్లాడిన ఆయన, ప్రజలు ఇప్పటికే వారి రాజకీయాలను గుర్తించారని అన్నారు. వైఎస్ కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్యానికి ఇలాంటి వ్యక్తులు పనికిరారని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో సునీత పోరాటం న్యాయపూర్వకమని, ఆమె ప్రయత్నాల వల్లే కేసు ఇంకా చర్చలో ఉందని చెప్పారు.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లులపై కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు దేశ రాజకీయాల్లో పెద్ద మార్పులు తెస్తాయని చంద్రబాబు అన్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో రాజ్యసభ స్థానాల కోసం పలువురు నేతలు కోరినట్లు సమాచారం. వారిలో వర్ల రామయ్య, కంభంపాటి రామ్మోహన్‌రావు, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!