
న్యూస్

రంజాన్ పండుగకు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమామ్లు, మౌజన్లకు శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా గౌరవ వేతనాల కోసం ₹45 కోట్లు విడుదల చేసింది. గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలను కూటమి ప్రభుత్వం ఒకేసారి క్లియర్ చేసింది. నిన్న నిర్వహించిన ఇఫ్తార్ విందులో సీఎం ఇచ్చిన హామీకి అనుగుణంగా కొన్ని గంటల్లోనే నిధుల విడుదలకు చర్యలు తీసుకోవడం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,000 మంది ఇమామ్లు, మౌజన్ల ఖాతాల్లోకి నేరుగా నగదు జమైంది. ఇందులో 5,000 మంది ఇమామ్లకు ఆరు నెలల వేతనం కింద ₹30 కోట్లు, మరో 5,000 మంది మౌజన్లకు ₹15 కోట్లు చెల్లించారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ముస్లిం మత గురువులకు ఊరటనిచ్చింది.




















.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!