
గాసిప్స్

15 వ ఆర్థిక సంఘం కింద తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రూ.387 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేయగా, తాజా నిధులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం రూ.646.36 కోట్లు అందాయి.
అయితే, 15 వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు సుమారు రూ.3,000 కోట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం కోరిన వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి సమర్పించడంతో, విడతల వారీగా నిధులు విడుదల అవుతున్నాయి.
ఇంకా సుమారు రూ.2,400 కోట్లు విడుదల కావాల్సి ఉండగా, గ్రామాల అభివృద్ధి వేగవంతం చేయడానికి పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!