

ముఖ్యమంత్రి విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర వీడియోను పోస్టు చేశారనే ఆరోపణలపై డీఎంకే మద్దతుదారుడు, పార్టీ కార్యకర్త అన్బానందన్ అరియప్పన్‌పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన కంటెంట్ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని చట్టప్రకారం చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ పరిణామం ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో గత డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మరుసటి రోజే చోటుచేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేసు నమోదు నేపథ్యంలో డీఎంకే నేతలు, ప్రభుత్వాన్ని విమర్శించే వారిని భయపెట్టేందుకే పోలీసులు అర్ధరాత్రి అరియప్పన్ ఇంటికి వెళ్లారని ఆరోపించారు. అయితే అధికార పక్షం మాత్రం చట్టపరమైన విధానాల ప్రకారమే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ ఘటనతో టీవీకే, డీఎంకే మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!