

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశకు అనుమతులు, నిధుల విడుదల కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన లేఖపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం లేఖ కేవలం రాజకీయ ప్రచారానికే పరిమితమైందని ఆరోపించారు. మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన పూర్తి వివరాలు, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ సర్టిఫికెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించలేదని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవసరమైన నివేదికలు సమర్పించడంతోనే గతంలో కేంద్రం మెట్రో ఫేజ్-2కు అనుమతి ఇచ్చిందని రాంచందర్ రావు తెలిపారు. ప్రాజెక్టు ఆలస్యానికి కేంద్రాన్ని బాధ్యులను చేయడం సరైంది కాదన్నారు. బీజేపీ హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఓల్డ్ సిటీతో సహా అన్ని ప్రాంతాలకు మెట్రో సేవలను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కంటే కమీషన్లు, స్కామ్‌లపైనే దృష్టి పెడుతోందని ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!