
గాసిప్స్

లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగాన్ని బీజేపీ ఎంపీలు అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. బడ్జెట్ అంశంపైనే మాట్లాడాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టడంతో సభలో హోరాహోరీ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పందిస్తూ, తనకు మాట్లాడే అవకాశం ఇస్తామని స్పీకర్ హామీ ఇచ్చారని తెలిపారు. అయితే సభలో తనను మాట్లాడకుండా అడ్డుకోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటన జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!