

వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ఆరోపణలు చేసింది. ఏపీ మద్యం రవాణా కేసులో రూ.18.09 కోట్ల అనుమానాస్పద లావాదేవీలకు ఆధారాలు లభించాయని, ఈ వ్యవహారంలో కారుమూరి కీలక పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. లిక్కర్ రవాణా ద్వారా వచ్చిన లాభాల్లో 50 శాతం కమీషన్ కోరినట్లు, అందులో రూ.11.95 కోట్లను కుటుంబ సభ్యుల ఖాతాలకు బదిలీ చేసినట్లు ఈడీ ఆరోపించింది.
దర్యాప్తులో కారుమూరి సహకరించలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. విచారణకు హాజరు కావాలని సుమారు పది సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని పేర్కొంది. ఆయన బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే జ్యుడీషియల్ రిమాండ్ కోరినట్లు తెలిపింది. హైదరాబాద్‌లోని ఈడీ ప్రత్యేక కోర్టు కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!