
ఓటిటి

హరీష్ రావు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం, లోయర్ సీలేరు ప్రాజెక్టును రాష్ట్రానికి దూరం చేయడం బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయం అని ఆరోపించారు. పార్లమెంట్లో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా కిషన్ రెడ్డికి అవగాహన లేదని హరీష్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన నివేదికల్లో కాళేశ్వరం వల్ల ఆయకట్టు పెరిగిందని ఉన్నప్పటికీ, దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. నితిన్ గడ్కరీ వంటి నాయకులు ప్రాజెక్టును మెచ్చుకున్నారని గుర్తుచేశారు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!