

నరేంద్ర మోదీ తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారీ బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని గుర్తు చేశారు. అక్కడ ప్రజలు అవినీతి, కుటుంబ రాజకీయాలను ఓడించారని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా అలాంటి మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలుగులో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ మాట్లాడగా, సభ ప్రాంగణం బీజేపీ కార్యకర్తల నినాదాలతో మార్మోగింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని విమర్శించిన మోదీ, తెలంగాణ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు ఆమోదం తెలిపినట్లు ప్రకటించిన ఆయన, దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఏడు పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కుల్లో ఒకదాన్ని తెలంగాణకు కేటాయించినట్లు గుర్తు చేశారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణ ఇప్పుడు నక్సలైట్ల రహిత రాష్ట్రంగా మారిందని, “వికసిత్ తెలంగాణ” లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోందని అన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!