

నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడం, ఉద్యోగుల అవసరాలను నియంత్రించుకోవడం వంటి కారణాలతో దేశవ్యాప్తంగా బ్యాంక్ శాఖల సంఖ్యలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 4 వేలకు పైగా శాఖలు మూతపడినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. 2021-22లో అత్యధికంగా 2,564 శాఖలు మూతపడగా, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో మరో 700 శాఖలు మూసివేశారు.
మరోవైపు, వ్యాపార విస్తరణలో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకులు కొత్త శాఖలను ప్రారంభించాయి. 2021-22 నుంచి 2025-26 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 6,255 కొత్త శాఖలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో 1,967 శాఖలు, అంతకుముందు ఏడాదిలో 1,823 శాఖలు ప్రారంభమయ్యాయి. రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ రుణాలను ఎగ్గొట్టిన విల్ఫుల్ డిఫాల్టర్లు 15,930 మంది ఉన్నారని, వారి మొత్తం రుణ బకాయిలు రూ.2.85 లక్షల కోట్లుగా ఉన్నాయని మంత్రి తెలిపారు. అలాగే, 2025 జూన్ 30 నాటికి రూ.90,545 కోట్లుగా ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 2026 జనవరి 31 నాటికి రూ.98,073 కోట్లకు పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!