

కృత్రిమ మేథస్సు వినియోగంలో బ్యాంకులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు. ముంబైలో ఫిక్కీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఫైబాక్ 2026’ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఏఐ వ్యవస్థల ఆధారంగా తీసుకునే నిర్ణయాలకు బ్యాంకులే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. తప్పిదాలు జరిగినప్పుడు ఏఐ మోడల్, అల్గారిథమ్ లేదా టెక్నాలజీ వెండర్‌ను నిందించడం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు.
ఏఐని మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా కాకుండా, దానికి సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగించాలని మల్హోత్రా సూచించారు. ఏఐ సిఫార్సులను విశ్లేషించి, అవసరమైనప్పుడు వాటిని సవరించేలా పటిష్టమైన మానవ పర్యవేక్షణ ఉండాలని అన్నారు. ప్రతి బ్యాంకు బోర్డు ఆమోదించిన ప్రత్యేక ఏఐ విధానాన్ని కలిగి ఉండాలని సూచించారు. కస్టమర్ సేవలు, రుణాల విస్తరణ, మోసాల గుర్తింపులో ఏఐకు మంచి అవకాశాలు ఉన్నప్పటికీ.. మోడల్ పక్షపాతం, డేటా గోప్యత, సైబర్ భద్రతా ముప్పులపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!