

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. సోషల్ మీడియా, సంగీతంపై ఆసక్తితో ఇప్పటికే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హిమాన్షు.. త్వరలోనే ఓ పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌తో వెండితెరపై కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది.
సినిమా ఎంట్రీ కోసం హిమాన్షు నటన, బాడీ లాంగ్వేజ్, ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఆయనను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు సరైన కథ, దర్శకుడి కోసం కుటుంబం అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే హిమాన్షు సినీ రంగ ప్రవేశంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆయన ఎలాంటి కథతో, ఏ దర్శకుడి చేతుల మీదుగా టాలీవుడ్‌లోకి అడుగుపెడతారనే ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!