
గాసిప్స్

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నేడు అమరావతికి రానున్నారు. ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ముఖ్య అంశాలపై చర్చలు జరగనున్నాయి.
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో కొనసాగుతున్న విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల ప్రాజెక్టులను మరింత విస్తరించే విషయంపై మాట్లాడనున్నారు. అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్, సంజీవని ప్రాజెక్ట్, సాంకేతికత ఆధారిత వ్యవసాయ విధానాలను ఆయన పరిశీలించనున్నారు. ఈ పర్యటన రాష్ట్రానికి ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!