
ఓటిటి

బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి భారీ ఆధిక్యం కల్పించడం అభివృద్ధి పట్ల వారి నమ్మకాన్ని మరోసారి చాటిందని అన్నారు.
ఎన్నికల ఫలితాలు స్పష్టంగా ప్రజల నిర్ణయాన్ని ప్రతిబింబిస్తున్నాయని, అభివృద్ధికే పట్టం కడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
బీహార్ ఓటర్లు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంచినట్లు ఈ తీర్పు చూపిస్తున్నదని ఆయన అన్నారు. దేశం అనేక రంగాల్లో ముందంజలో సాగుతుండటంతో, ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నారని వివరించారు.
ఎన్డీఏ విజయానికి కారణం అభివృద్ధిని కోరుకునే ప్రజల సంకల్పమేనని, ఈ ఫలితాలు దేశ దిశను మరింత బలపరుస్తాయని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!