

పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి శూన్యమని, బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లతోనే మమతా బెనర్జీ ఇప్పటివరకు గెలుస్తూ వచ్చారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆరోపించారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, మమతా అరాచకాలు మరియు దేశ వ్యతిరేక చర్యల కారణంగానే ఆమె ఓటమి తప్పలేదని విమర్శించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ స్వస్థలంలో భాజపా విజయం సాధించడం సంతోషకరమని పేర్కొన్నారు. అస్సాం, పుదుచ్చేరిల్లో స్పష్టమైన మెజారిటీ సాధించామని, తమిళనాడు, కేరళల్లో ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు.
రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో ప్రజలు “అన్యాయ పాలనకు” ముగింపు పలికారని అన్నారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సంపద సృష్టి కారణంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజల మద్దతు కొనసాగుతోందని తెలిపారు. ఈ విజయంతో భాజపా రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. నేతలు, కార్యకర్తలు టీవీలో ఫలితాలు వీక్షించి అనంతరం కార్యాలయం బయట ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!