

ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధు సూర్య నిర్మిస్తున్న ‘శివ గాడి జిందగీ’ సినిమా టైటిల్, సాంగ్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వినయ్ రెడ్డి చందుపట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు టైటిల్‌ను విడుదల చేయగా, రీల్ఆన్ సీఈఓ దాశరథం బిట్ల, రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ ప్రిన్సిపల్ పూల సందీప్ కుమార్ నాయుడు, జర్నలిస్టు శివ మల్లాల సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అతిథులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ చిత్రం ఒక సాధారణ మనిషి జీవితాన్ని ప్రతిబింబించేలా రూపొందుతున్నదని దర్శకుడు తెలిపారు. కామెడీ, ఎమోషన్, డ్రామా, ప్రేమ, స్నేహం వంటి అన్ని అంశాలతో కథ సాగుతుందని చెప్పారు. నిర్మాత సింధు సూర్య మాట్లాడుతూ, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఎంతో కృషితో సినిమా రూపొందిస్తున్నారని తెలిపారు. జేపీ రెడ్డి ఛాయాగ్రహణం, సాయి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ చిత్రం ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకేలా ఉండబోతుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!